● రూ.2 కోట్లకు విక్రయించిన అక్రమార్కులు
● అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు వసూలు
● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
గద్వాల: జిల్లా కేంద్రంలో ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు పాగా వేసి.. ఈ స్థలం మాదే అంటూ ఇతరులకు విక్రయించి రూ.లక్షల నుంచి రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఇదివరకే రూ.కోట్లు విలువ చేసే స్థలాలు కుల, మత సంఘాలకు అప్పనంగా కట్టబెట్టడంతో అన్యాక్రాంతమయ్యాయి. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. తాజాగా మరో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రూ.2 కోట్లకు విక్రయించిన ఘటనలు వెలుగులోకి వచ్చింది.
40 ఏళ్ల నాటి స్థలం..
1980–84లో గద్వాల పట్టణంలోని సుంకులమ్మమెట్టు కాలనీలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో మున్సిపాలిటీకి 10 శాతం స్థలం కేటాయించారు. తాజాగా ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. 40 ఏళ్ల కిందటి స్థలం.. ఎవరు గుర్తిస్తారు అన్న నమ్మకమో.. ఒకవేళ గుర్తించినా మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనుకున్నారో ఏకంగా మున్సిపాలిటీకి ఇచ్చిన పది శాతం స్థలాన్ని కబ్జా చేసి రూ.2 కోట్లకు విక్రయించారు. ఇందులో అడ్వాన్స్ కింద రూ.30 లక్షలు చేతులు మారాయి. ఈ క్రయవిక్రయాల్లో ఓ బ్యాంక్ ఓనర్ కుమారుడు, ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ఉండడం జిల్లా కేంద్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment