సమన్వయంతో నీటి సంఘాల ఎన్నికలు
కాకినాడ సిటీ: జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల నిర్వహణపై డీఆర్వో జె.వెంకటరావు ఇరిగేషన్ అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షించారు. నీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేశామని, జిల్లాలో గోదావరి, ఏలేరు, పుష్కర, పంపా, సుబ్బారెడ్డిసాగర్, తాండవ, మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆయకట్టు కింద నీటి సంఘాలకు నవంబర్ 20 నుంచి 22 వరకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించి ప్రాదేశిక నియోజకవర్గం వారీగా అడంగల్ అనుసరించి రైతులు వివరాలు సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని, క్షేత్రస్థాయిలో తహసీల్దార్లతో సమన్వయం చేసుకుంటూ రైతుల ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. సమావేశంలో కాకినాడ, పెద్దాపురం ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, డీఈలు ఎం.రవి, ఆర్.పోచారావు, పుష్కర కెనాల్ ఈఈ రాజేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వో బాధ్యతల స్వీకరణ
అంతకు ముందు జిల్లా రెవెన్యూ అధికారిగా జె.వెంకటరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకటరావు కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనాలను మర్యాదపూర్వకంగా కలిశారు.
అధికారులకు డీఆర్వో వెంకటరావు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment