బయోటెక్ పరిశ్రమలో సీఐడీ సోదాలు
పెద్దాపురం: మండలంలోని చిన బ్రహ్మదేవం గ్రామంలో కందుల పట్టాభి రామకృష్ణ (కేబికే) అల్కాహాల్ పరిశ్రమలో బుధవారం విశాఖపట్టణం సీఐడి అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. సీఐడీ ఇన్స్పెక్టర్ వి.బాబ్జీరావు, గోపినాథ్‌ల ఆధ్వర్యంలో బయోటెక్ పరిశ్రమలో సోదాలు నిర్వహించారు. డిస్టిలరీలకు ఎంత మొత్తంలో మద్యం సరఫరా అయ్యింది, మద్యం నిల్వ సరఫరా రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిసింది. బయోటెక్‌లో తయారవుతున్న పోర్టబుల్ ఆల్కాహాల్, ఇథనల్, ఇథైల్, శానిటైజర్, పీడీ ఫార్మ గ్యాస్ ఉత్పత్తులపై పూర్తి స్థాయిలో సీఐడీ అధికారులు ఆరా తీశారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment