75 కిలోల బస్తాకు
రూ.2 వేల మద్దతు ధర ఇవ్వాలి
సొంతంగా అర ఎకరం సాగు చేశాను. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఖరీఫ్ ప్రారంభంలో సకాలంలో వర్షాలు పడక సాగు ఆలస్యమైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలు, తర్వాత ప్రతికూల పరిస్థితుల వల్ల పెట్టుబడులు ఎక్కువ అయ్యాయి. ఖరీఫ్‌లో కూలి రేట్లు, వరి కోత యంత్రం రేట్లు పెంచేయడంతో పెట్టుబడులు తడిసిమోపెడయ్యాయి. వరి కోతలు ముందు వరకు ఎకరాకు రూ.30 వేలు ఖర్చుపెట్టగా, కోత, కట్టేత, నూర్పిడికి మరో రూ.10 వేలు అయ్యాయి. 75 కిలోల బస్తా ప్రస్తుతం రూ.1,650కు కొంటున్నారు. ఎకరాకు 35 బస్తాలకు మించి దిగుబడులు రావడం లేదు. పెరిగిన ఎరువులు, పురుగుమందులు, కూలిరేట్లను బట్టి 75 కిలోల బస్తాకు రూ.2 వేల మద్దతు ధర ఉంటే గట్టెక్కేవాళ్లం. ఇప్పుడైతే అప్పులే మిగులుతున్నాయి.
– మారెళ్ల వెంకటరమణ,
కౌలురైతు, యండమూరు, కరప మండలం
Comments
Please login to add a commentAdd a comment