దిగుబడి తగ్గింది
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నాట్లు వేసిన దగ్గర నుంచి వరుసగా తుపానులు, అధిక వర్షాలు పడడంతో పంట దిగుబడి సగానికి సగం తగ్గిపోయింది. ఎకరాకు 45 బస్తాలు దిగుబడి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను. తీరా మాసూళ్లు పూర్తి అయ్యే సరికి ఎకరాకు 32 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. ఇటీవల వచ్చిన ఏలేరు వరదల వల్ల పంట చాలావరకు దెబ్బతినగా, తరువాత వరుసగా వర్షాలు రావడంతో ఉన్న పంట కూడా దెబ్బతింది.
– కూత రామ్మూర్తి, రైతు, రమణక్కపేట, కొత్తపల్లి మండలం
ఖరీఫ్ పంట దక్కకుండా పోయింది
ఈ ఏడాది ఖరీఫ్ పంట అంతా ప్రకృతి వైపరీత్యాల వల్ల దక్కకుండా పోయింది. ఎకరానికి 40 బస్తాలు అవ్వాల్సిన పంట 15 నుంచి 20 బస్తాలు కూడా కాలేదు. ఏలేరు వరద, అధిక వర్షాల వల్ల పెట్టుబడులు రెట్టింపు అయ్యాయి. ఎకరాకు రూ.30 వేలు అయ్యే పెట్టుబడి ఈసారి రూ.45 వేలు అయింది. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి ఈ ఏడాది ఖరీఫ్ నష్టాలను మిగిల్చింది.
– పెనుమల్లు త్రిమూర్తులు, రమణక్కపేట, కొత్తపల్లి మండలం
రెండుసార్లు నాట్లు వేయాల్సి వచ్చింది
నేను ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఆగస్టు నుంచి మూడు పర్యాయాలు కురిసిన వర్షం కారణంగా చేలు పూర్తిగా పాడైపోయాయి. రెండు పర్యాయాలు వరి నాట్లు వేసుకోవాల్సి వచ్చింది. ఎకరాకు అదనంగా రూ.20వేలు పెట్టుబడి అయ్యింది. వర్షాలు రావడం, నాట్లు రెండు పర్యాయాలు వేయడంతో పంట దిగుబడి ఎకరానికి ఐదు నుంచి పది బస్తాల వరకు తగ్గిపోయింది.
– తలారి దొరబాబు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం
Comments
Please login to add a commentAdd a comment