అన్నింటా అభివృద్ధి చెందినా.. నైతికంగా దిగజారుతున్నాం..
చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలపై భావోద్వేగంగా మాట్లాడుతున్న కలెక్టర్ షణ్మోహన్ ఓ సందర్భంలో కంట తడిపెట్టడం సభికులను కలచివేసింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా నైతికతలో రోజు రోజుకూ దిగజారిపోతున్నామని, నాగరికతకు నిదర్శనంగా చెప్పుకునే భారతదేశంలో బాలికల ఆక్రందనలు ఆగడం లేదన్నారు. చాక్లెట్ కొనిస్తానని ఒకడు, హోలీ ఆడుకునేందుకు రంగులు కొనిస్తా నని, మామిడి పండిస్తానని ఇంకొకడు, అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారిని మరొకడు ఇలా పసిమొగ్గల బతుకులను చిదిమేస్తున్నారన్నారు. నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా బాలికల సంరక్షణ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోందని కంటతడి పెట్టడంతో సభా ప్రాంగణంలో నిశ్శబ్దం ఆవహించింది. జిల్లాలోని పిఠాపురం పట్టణానికి చెందిన బాలికపై మాధవపురం డంపింగ్ యార్డు దగ్గర జరిగిన అఘాయిత్యం, తూరంగి గ్రామంలో ఓ చిన్నారిపై జరిగిన అఘాయిత్యాలను ఉద్దేశించి ఆయన కలత చెంది.. అంతలోనే తేరుకుని నేనున్నానంటూ చిన్నారులకు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment