ఆసుపత్రి ప్రసవాలను పెంచాలి
కాకినాడ సిటీ: అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రసూతి సేవలు అందించి, ఆసుపత్రి ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి వైద్యాధికారులను కోరారు. మంగళవారం కలెక్టరేట్ వివేకానంద హాలులో ఆయన వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల అందిస్తున్న సేవలపై సమీక్షించారు. గత ఆరు మాసాలలో జిల్లాలోని 44 పీహెచ్‌సీలు, 23 యూపీహెచ్‌సీలలో కేవలం 400 ప్రసవాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పీహెచ్‌సీలో నెలకు కనీసం 15 ప్రసవాలు నిర్వహించాలని ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు తమ కేంద్రం పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న యుక్తవయస్సు బాలికలలో రక్తహీనతకు లోనైన వారిని గుర్తించి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్ కేసులను తొలిదశలోనే గుర్తించి నివారించేందుకు చేపట్టిన ఎన్‌సీడీ 3.0 సర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. డీఎంఅండ్‌హెచ్‌వో జె.నరసింహనాయక్, అడిషనల్ డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు.
దళారులను నమ్మవద్దు
ఖరీఫ్–2024–25 రైతులు పండించిన ధాన్యాన్ని దళారులు, మధ్యవర్తులకు అమ్ముకొని మోసపోకుండా నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి కనీస మద్దతు ధర పొందాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి రైతులను కోరారు. మంగళవారం ధాన్యం కొనుగోలుపై విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 277 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సాధారణ రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,300, గ్రేడ్–ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2,320 ధర నిర్ణయించామన్నారు. గోనె సంచులను, హమాలీలను, రవాణా వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఒకవేళ రైతు ఏర్పాటు చేసుకుంటే వాటి సొమ్మును నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 8,064 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ధాన్యం మద్దతు ధరలో సమస్యలు ఉంటే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ 88869 03611 నంబర్‌కు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
మరుగుదొడ్డి ఆత్మ గౌరవ సూచిక
ఆత్మ గౌరవ సూచిక అయిన మరుగుదొడ్డిని జిల్లాలోని ప్రతి కుటుంబం నిర్మించుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి కోరారు. మంగళవారం వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించి కలెక్టరేట్ వివేకానంద సమావేశపు మందిరంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం, డిస్ట్రిక్ వాటర్ అండ్ శానిటేషన్‌మిషన్ (డీడబ్ల్యూఎస్‌ఎమ్) కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఆయన అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో 3,89,205 కుటుంబాలు ఉండగా, ఇప్పటి వరకూ 3,86,393 కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకున్నాయన్నారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవలసిన 2,822 కుటుంబాలకు వాటిని మంజూరు చేస్తామన్నారు. తొలుత టాయిలెట్ వినియోగంపై జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ ప్రచురించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని క్లాప్ మిత్రులను కలెక్టర్ సత్కరించారు. పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment