జీఆర్టీ జ్యూయలర్స్ షోరూం ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: జీఆర్టీ జ్యూయలర్స్ 61వ షోరూమ్‌ను బుధవారం రాజమహేంద్రవరం డీలక్స్ సెంటర్‌లో ప్రారంభించారు. జీఆర్టీ 60 ఏళ్లుగా నాణ్యత, విశ్వాసం, బలమైన ఉనికితో వ్యాపారాన్ని సాగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారం, డైమండ్, ప్లాటినం, వెండి, జాతి రత్నాల ఆభరణాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గింపు, బంగారు ఆభరణాల వేస్టేజీపై 20 శాతం తగ్గింపు, డైమండ్ విలువపై క్యారెట్‌కు రూ.10 వేల తగ్గింపుతో అందిస్తున్నామన్నారు. కస్టమర్లు వెండి వస్తువులు పట్టీల మేకింగ్ చార్జీలపై 25 శాతం తగ్గింపు, అన్కట్ డైమండ్ విలువపై 10 శాతం తగ్గింపు అందిస్తున్నామని జీఆర్టీ జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. కార్యక్రమంలో జ్యూయలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
గాయపరిచిన వ్యక్తిపై కేసు
కొత్తపల్లి: యువకుడిని గాయపరిచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు బుధవారం స్థానిక పోలీసులు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన యువకుడు గంట శ్రీను ఆదివారం రాత్రి టిఫిన్ తెచ్చేందుకు సెంటర్‌లోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి శ్రీనును ఆపి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా వైఎస్సార్ సీపీ టీషర్స్ వేసుకుంటున్నావని, గతంలోనే హెచ్చరించినా బుద్ధి రాలేదా అంటూ అన్నాడు. దీంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. శ్రీను ను రాజు తలపై గాయపరచగా, పిఠాపురం ప్రభు త్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై బాధితుడు శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
గుమస్తా చేతివాటం
నిడదవోలు: గోల్డ్ టెస్టింగ్ షాపులో ఏడాదిన్నరగా నమ్మకంగా పని చేస్తున్న ఓ గుమస్తా చేతివాటం ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. నిడదవోలులో సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర రాజ్యవేడి గ్రామానికి చెందిన బంగారు వ్యాపారులు ప్రశాంత్, నేతాజీలు 20 ఏళ్ల కిందట ఆంధ్రాకు వచ్చారు. ఇందులో వ్యాపారి ప్రశాంత్ రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ షాపు, మరో వ్యాపారి నేతాజీ తాడేపల్లిగూడెంలో జేపీ గోల్డ్ టెస్టింగ్ షాపులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో డీకే గోల్డ్ టెస్టింగ్ బంగారు షాపులో అమర్ గుమస్తా ఏడాదిన్నరగా పని చేస్తున్నాడు. అయితే తాడేపల్లిగూడెం షాప్‌లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి పనిచేయడం మానేయడంతో 15 రోజుల కిందట గుమస్తా అమర్‌ను తాడేపల్లిగూడెం షాపునకు పనికి పంపించారు. తాడేపల్లిగూడెం షాపు యజమాని నేతాజీ ఈ నెల 13న రాత్రి రాజమహేంద్రవరం షాపునకు తీసుకు వెళ్లాలని సుమారు 289.340 గ్రాముల గోల్డ్ కచ్చా ముక్కలు, రూ. 6.30 లక్షల నగదును అమర్‌కు ఇచ్చాడు. వాటిని తీసుకుని ఈనెల 14న అతను మోటార్ సైకిల్‌పై బయలు దేరాడు. అమర్ ముందుగా వేసుకున్న పధకం ప్రకారం నిడదవోలు పట్టణంలోని ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం వద్ద రోడ్డు పక్కన తుప్పల్లో బంగారం, నగదును దాచాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment