అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి
– వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడ రూరల్: సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు కలిసిమెలిసి జీవించాలనే మంచి సంకల్పంతో ముందుకు వెళదామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ శుభం కాపు కల్యాణ మంటపంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం, కాపునాడు ఆధ్వర్యంలో ఆదివారంనిర్వహించిన కార్తిక కాపు వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ వంగా గీత, కాపు సంఘ పెద్దలతో కలిసి ఆయన కార్తిక పూజలో పాల్గొన్నారు. కన్నబాబు మాట్లాడుతూ సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు బాగుండాలని ఆకాంక్షించారు. కాపులకు సహాయం చేసేందుకు ముందు వంగా గీత అక్కలా ముందు ఉంటారని పేర్కొన్నారు.
కాపుల ఐక్యత, అభివృద్ధి కోసం పనిచేద్దాం
కాపుల ఐక్యత, అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని కాపు ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. కాకినాడలోని కాపు వనసమారాధనలో పాల్గొన్న కాపు సామాజిక వర్గ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, టీడీజీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, కౌడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి పేర్కొన్నారు. కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసురెడ్డి ఏసుదాసు ఆధ్వర్యంలో వివిధ హోదాలలో ఉన్న సామాజికవర్గానికి చెందిన వారిని సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment