బాల సాహిత్యంలో అద్భుతమైన కథలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ చిరంజీవిని కుమారి
బాలాజీచెరువు: బాల సాహిత్యం నుంచి అద్భుతమైన కథలు వచ్చాయని జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవిని కుమారి పేర్కొన్నారు. ఐడియల్ డిగ్రీ కళాశాలలో ఆదివారం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కథ ఏమిటీ, ఎందుకు, ఏలా అనే అంశంపై సమాలోచన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ కవి అవధానుల మణిబాబు ఆహ్వానం పలకగా దేశ భక్తి గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిరంజీవిని కుమారి మాట్లాడుతూ కథ అనేది చరిత్రకు, జీవితానికి, సాహిత్యానికి అనుబంధం వంటిదన్నారు. మనిషి పుట్టగానే ఽకథ ప్రారంభమైందని, ముఖ్యంగా బాల సాహిత్యం నుంచి కథలు ఆవిర్భవించాయన్నారు. చినుకు సంపాదకులు నండూరి రాజగోపాల్ మాట్లాడుతూ పెద్దల నుంచి విన్నదే కథ అని అన్నారు. రచయిత వాడ్రేవు వీరలక్ష్మీ మాట్లాడుతూ వర్ణనలో, సంభాషణలో, కథ చెప్పడంలో లోతయిన పరిజ్ఞానం ఉండాలని అన్నారు. కధా రచయిత మహ్మాద్ ఖదీర్‌బాబు మాట్లాడుతూ సీ్త్రల సమస్యలపై ఎన్నోఽ కథలు వచ్చాయన్నారు. కాశీబోట్ల సత్యనారాయణ, జి.వెంకటనరసింహా, అద్దేపల్లి జ్యోతి, డాక్టర్ ఏంవీ భరతలక్ష్మి, చింతపల్లి సుబ్బారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment