12 అంగుళాల పుంగనూరు దూడ జననం | - | Sakshi
Sakshi News home page

12 అంగుళాల పుంగనూరు దూడ జననం

Published Thu, Nov 28 2024 12:13 AM | Last Updated on Thu, Nov 28 2024 12:13 AM

12 అంగుళాల  పుంగనూరు దూడ జననం

12 అంగుళాల పుంగనూరు దూడ జననం

ఆలమూరు: మండలంలోని గుమ్మిలేరు రైతు పశుపోషక అవార్డు గ్రహీత రెడ్డి సత్తిబాబు పశువుల మకాంలో బుధవారం పుంగనూరు పెయ్యి దూడ జన్మించింది. అయితే ఈ దూడ కేవలం 12 అంగుళాల ఎత్తులో ఉండటం విశేషం. సాధారణంగా పుంగనూరు దూడలు 15 నుంచి 18 అంగుళాల వరకూ ఉంటాయి.

30న సైక్లింగ్‌ క్రీడాకారుల ఎంపిక

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): గుంటూరు జిల్లా మందడం గ్రామంలోని గుడ్‌రోల్‌ ఇంగ్లిషు మీడియం స్కూల్లో ఈ నెల 30న రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌ కుమార్‌ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ ఈ పోటీలలో ఎంపికై న వారు డిసెంబరు 7 నుంచి 10 వరకు ఒడిశాలోని పూరిలో జరిగే జాతీయస్థాయి సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలవారు తమ సొంత సైకిల్‌తో గుంటూరులో జరిగే ఎంపికలకు హాజరుకావాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement