రాష్ట్ర స్థాయి కబడీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కబడీ పోటీలకు ఎంపిక

Published Fri, Dec 27 2024 4:15 AM | Last Updated on Fri, Dec 27 2024 4:15 AM

రాష్ట్ర స్థాయి కబడీ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి కబడీ పోటీలకు ఎంపిక

తాళ్లపూడి: రాష్ట్ర స్థాయి అండర్‌–19 కబడ్డీ పోటీలకు మండలంలోని వేగేశ్వరపురానికి చెందిన దూపాని మహేష్‌ ఎంపికయ్యాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న అతడు ఈ నెల 24న జంగారెడ్డిగూడెం మండలం కామవరపుకోటలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చూపాడు. తద్వారా వచ్చే నెల 3 నుంచి కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కబడ్డీలో గత ఏడాది వేగేశ్వరపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి కూడా స్టేట్‌ మీట్‌కు ఎంపికై , పతకం సాధించాడు. మహేష్‌ను స్థానిక కరిబండి కళాశాల డైరెక్టర్‌ కరిబండి త్రినాథస్వామి, ప్రిన్సిపాల్‌ పి.మురళి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డి.మాధవరావు, అధ్యాపకులు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement