ఎమ్మెల్యే ఇంటి ముందు జీడిపిక్కల కార్మికుల బైఠాయింపు
ప్రత్తిపాడు: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చిన్నింపేట జీడిపిక్కల ఫ్యాక్టరీ కార్మికులు ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నివాసం వద్ద గురువారం సుమారు 3 గంటల పాటు బైఠాయించారు. తాము 41 రోజులుగా కార్మికులు పోరాడుతున్నా అటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ, ఇటు ప్రజాప్రతినిధులు కానీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ, కార్మికులు రోడ్డున పడితే నాయకులు స్పందించకపోవడం సరికాదని అన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేక పర్యాయాలు వినతులు అందజేసినా పట్టించుకోలేదని విమర్శించారు. మూసివేసిన ఫ్యాక్టరీని వెంటనే తెరిపించి, కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ఈశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ, కార్మికులు ధర్నా చేయడం సరికాదని అన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment