19న గిరిజన సమ్మేళన సభ
కాకినాడ రూరల్: గిరిజన ఆదివాిసీ సమ్మేళన సభ ఈ నెల 19వ తేదీన విజయవాడ వేదికగా నిర్వహిస్తున్నట్టు గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన ఐక్య వేదిక రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ మధు కుమార్ తెలిపారు. మంగళవారం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.కమలకుమారి ముఖ్యఅతిథిగా హాజరు కాగా సభ వాల్‌పోస్టర్లను ప్రిన్సిపాల్‌తో పాటు, మధుకుమార్, అధ్యాపకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులను జాగృతం చేసే కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ నెల 19న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే గిరిజన ఆదివాసీ సమ్మేళన సభ జయప్రదం చేయాలని ప్రిన్సిపాల్ పిలుపునిచ్చారు. గిరిజన ప్రజా సమాఖ్య, ఐక్యవేదిక రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి డాక్టర్ ఎల్.మధుకుమార్ ఆదివాసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. మహముద్ నదీమ్, డాక్టర్ జోసఫ్ స్టీఫెన్, డాక్టర్ గోపి, మనోజ్ దేవా, విద్యార్థులు కళ్యాణ్, ప్రవీణ్, సాయి ప్రవీణ్, జీవీఎస్ వివిధ జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment