రత్నగిరిపై చురుగ్గా ఏర్పాట్లు
అన్నవరం: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా రత్నగిరి వాసుడు సత్యదేవుని సన్నిధిన ఉత్తర ద్వారదర్శనం ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఆ రోజు తెల్లవారుజామున ఐదు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులను స్వామి, అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. సత్యదేవుని ప్రధానాలయంలో దక్షిణ ద్వారం వద్ద ఉత్తర అభిముఖంగా మంటపాన్ని ఏర్పాటు చేసి అందులో శేషపాన్పు మీద పవళిస్తున్న విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక క్యూ లు నిర్మిస్తున్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు పులిహోర బదులు కదంబం ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్లను వెండి రథంపై ఆలయ ప్రాకారంలో, రాత్రి ఏడు గంటలకు అన్నవర పురవీధుల్లో వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారని అధికారులు తెలిపారు.
సాంస్కృతిక
ప్రదర్శనలు
తొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి భరతనాట్యం, పదో తేదీ ఉదయం కోలాటం, భరత నాట్యం, రాత్రి ఏడు గంటలకు శ్రీవేంకటేశ్వర నాట్యమండలి నెల్లూరు వారి శ్రీకృష్ణరాయభారం నాటక ప్రదర్శన ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment