§ýl„ìS×æ ¿êÆý‡™èl Ýë¦Æ‡$$MìS ˘ మూడు ప్రాజెక్టుల ఎంపిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శలో కాకినాడ జిల్లా నుంచి మూడు ప్రాజెక్టులు ప్రతిభ చూపి పుదుచ్ఛేరిలో ఈ నెల 20 నుంచి నిర్వహించే దక్షిణ భారత స్థాయి పోటీలకు అర్హత సాధించాయి. ఈ మేరకు జిల్లా సైన్స్ అధికారి వినీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత విభాగంలో రెండు, టీచర్ విభాగంలో ఒక ప్రాజెక్టు ఎంపికయ్యాయన్నారు. బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి బలరామ శివ రూపొందించిన సూర్యుని అనుసరించే సోలార్ పలకల ప్రాజెక్టు, ధర్మవరం జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థి సాయిబాబు తయారు చేసిన మల్టీపర్పస్ మిషన్ ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. అలాగే ఉపాధ్యాయ విభాగంలో గణిత అవధాని రవిశంకర్ తయారు చేసిన ఆల్రౌండ్ 90 డిగ్రీస్ ప్రాజెక్టు ఎంపికై ందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్, డీఈఓ కార్యాలయ సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment