![44వ డివిజన్‌లో కరపత్రాలు పంపిణీ చేస్తున్న బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ నాయకులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/23/22nzt703-250041_mr_1.jpg.webp?itok=lo1JVeST)
44వ డివిజన్‌లో కరపత్రాలు పంపిణీ చేస్తున్న బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ నాయకులు
సుభాష్‌నగర్: కేంద్రంలోని బీజేపీ పాలన ప్రజానికానికి స్వర్ణయుగమని, అనేక సంక్షేమ పథకాలు అమలుజేస్తూ అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పేర్కొన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా గురువారం నగరంలోని 44వ డివిజన్‌లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి పోతన్‌కర్ లక్ష్మీనారాయణ 39వ డివిజన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందగిరి రాజశేఖర్‌రెడ్డి 5వ డివిజన్‌లో ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ, కరపత్రాలు పంపిణీ చేశారు. 9090902024 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇప్పిస్తూ మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందని తెలిపారు. మరో 20 ఏళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం ఖాయమన్నారు. రాష్ట్రంలోనూ వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. నాయకులు శీలశ్రీనివాస్, మీసేవా శ్రీనివాస్, పాండు, నరేష్, సుమన్, ఓంప్రకాశ్, హరీష్, మారుతి, వినయ్, వినోద్, వంశీకృష్ణ, సాయిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment