![దూదిగాంలో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/3/02blk07-250010_mr.jpg.webp?itok=3YMOlhx8)
దూదిగాంలో వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు
బాల్కొండ: మెండోరా మండలం దూదిగాంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మెండోరా ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సరికెల లక్ష్మి ఇంటికి తాళం వేసి గత సోమవారం హైదరాబాద్‌కు వెళ్లింది. బుధవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తాళం పగుల గొట్టి ఉంది. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని నాలుగు తులాల బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటిని పరిశీలించి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు చేశారు.
పోత్నూర్ బెల్ట్ షాప్‌లో..
సిరికొండ: మండలంలోని పోత్నూర్‌లో వినోద్‌కు చెందిన మద్యం బెల్ట్ దుకాణంలో మంగళవారం అ ర్ధరాత్రి దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలి పారు. దొంగలు దుకాణం తాళం పగులగొట్టి రూ. లక్ష విలువైన మద్యం సీసాలను ఎత్తుకెళ్లారు. ఎస్సై రమేశ్ చోరీ జరిగిన దుకాణాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment