నేడు శివం కమిటీ సమావేశం
నిజాంసాగర్: రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలతో పాటు జిల్లాలోని నిజాంసాగర్, పోచారం, కౌలాస్ ప్రాజెక్టులనుంచి ఆయకట్టుకు నీటి విడుదల కోసం సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో శివం కమిటీ సమావేశం జరగనుంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యతననుసరించి ఆయకట్టుకు నీటి విడుదల వివరాలను ఖరారు చేయనున్నారు.
నిజాంసాగర్ ఆయకట్టు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు కింద యాసంగి సీజన్‌లో 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ప్రాజెక్టు దాదాపు నిండు కుండలా ఉండడంతో ఆయకట్టుకు 7 విడతల్లో 12 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనల మేరకు శివం కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ఈ నెలలోనే డీఐబీ సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment