6న జిల్లాకు మంత్రి జూపల్లి రాక
కామారెడ్డి క్రైం: ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కృతిక శా ఖల మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం జిల్లా లో పర్యటించనున్నారని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తె లిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం సేకరణ, సమగ్ర కుటుంబ సర్వే ఆన్‌లైన్ ఎంట్రీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మద్నూర్‌లో సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం మద్నూర్ ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారన్నా రు. లింగంపేటలోని నాగన్నగారి మెట్ల బావి పరిశీలన, కామారెడ్డి బల్దియాలో తాగునీటి వసతుల కల్పన తదితర కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని, కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ఆన్‌లైన్ ప్రక్రియ ఇప్పటివరకు 83 శాతం పూర్తయ్యిందన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, సహకార అధికారి రామ్మోహన్, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు, ఏఎస్‌వో నరసింహారావు, డీఈవో రాజు, మార్కెటింగ్ అధికారి రమ్య, మున్సి పల్ డీఈఈ వేణుగోపాల్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పర్యటనకు ఏర్పాట్లు చేయండి
అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment