5న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కామారెడ్డి అర్బన్: డీఈఈ సెట్‌లో అర్హత పొంది గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హా జరుకానివారు గురువారం నిజామాబాద్ లోని డైట్ కళాశాలకు రావాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినవారు ఈనెల 7 నుంచి 9వ తేదీవరకు వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. మొదటి విడతలో జాయిన్ అయినవారికి స్లైడిండ్ అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండో విడతలో సీట్లు పొందిన వారు ఈనెల 13 నుంచి 17 వరకు ఆయా కళాశాలలకు వెళ్లి రిపోర్ట్ చేయాలని సూచించారు. రెండో విడతలో మిగిలిపోయిన సీట్లను ఈనెల 18న మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
పోషవ్వకు పురస్కారం
కామారెడ్డి అర్బన్ : గో ఆధారిత ఉత్పత్తులు చేస్తున్న దివ్య హస్తం ట్రస్ట్ యాజమాని, ది వ్యాంగురాలు చింతల పోషవ్వకు రాష్ట్ర ప్ర భుత్వం బెస్ట్ సెల్ఫ్ ఎంప్లాయి పురస్కారం అందించింది. మంగళవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కార్యక్రమంలో వికలాంగు ల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీ రయ్య తదితరులు పాల్గొన్నారు.
14న జాతీయ
లోక్ అదాలత్
కామారెడ్డి టౌన్ : ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి వీఆర్‌ఆర్ వరప్రసాద్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు లాల్‌సింగ్, శ్రీనివాస్‌నాయక్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, జూనియర్ జడ్జి సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
‘ప్రభుత్వ ఆస్పత్రిలోనే
ప్రసవాలు జరిగేలా చూడాలి’
సదాశివనగర్: ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రస వాలు జరిగేలా చూడాలని జిల్లా మాతా, శిశు ఆరోగ్య కార్యక్రమం అధికారి అనురాధ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి, బిడ్డల ఆర్యోగాన్ని మెరుగుపరచడానికి సిబ్బంది అంకితభావంతో సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఆస్మా అప్సిన్, సీహెచ్‌వో నాగరాజు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరాశ్రయులకు
వసతి సౌకర్యం
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలో నిరాశ్రయులైన వారికి వసతి సౌకర్యం కల్పించామని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. మున్సిపాలిటీ పక్కన గల ఆశ్రమంలో సుమారు 20 మందికి మంగళవారం ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ నిరాశ్రయులకు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో భోజన సౌకర్యం కల్పించామన్నారు. వారికి అవసరమైన తాగునీరు అందించామని, బెడ్ షీట్స్ సమకూర్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment