జుక్కల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తాం
మద్నూర్: జుక్కల్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో సాగుతున్నామని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గానికి మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శుక్రవారం మద్నూర్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా ఈ కార్యక్రమం సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని గురు ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. అనంతరం మద్నూర్‌లో నూతన రేషన్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ నూతన చైర్‌పర్సన్ సౌజన్య, పార్టీ మండలాధ్యక్షుడు సాయిలు, నాయకులు సాయి పటేల్, హన్మండ్లు స్వామి, రాంపటేల్, రమేష్, శీనుపటేల్, విఠల్‌గురూజీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు
మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు
Comments
Please login to add a commentAdd a comment