‘సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం’
కామారెడ్డి క్రైం: దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 48,446 మంది దివ్యాంగులకు దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు. దివ్యాంగులకు పలు రకాల రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. 18,080 మందికి ప్రతినెలా రూ.7.26 కోట్లను పింఛన్‌ల రూపంలో పంపిణీ చేస్తున్నామన్నారు. దివ్యాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి ఇస్తున్నామని తెలిపారు. సదరం క్యాంప్ స్లాట్‌లను 650 కి పెంచామన్నారు. ఉపాధి హామీ పథకం కింద దివ్యాంగులకు సులువుగా ఉండే పనులు కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఉపాధి హామీ పథకం కింద పనులు గుర్తించి నమోదు చేయడంలో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని, 64 వేల పని దినాలు కల్పించి రాష్ట్రంలో ఐదో స్థానంలో నిలిచామని పేర్కొన్నారు.
దివ్యాంగులకు అండగా నిలుస్తున్నాం
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దివ్యాంగులకు అండగా నిలుస్తోందని ఆ సంస్థ కార్యదర్శి నాగరాణి పే ర్కొన్నారు. వైకల్యం ఉందని కుంగిపోవద్దని, పట్టుదలతో శ్రమించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బ్యాక్ లాగ్ పోస్టు ల భర్తీ చేయాలని, అంత్యోదయ కార్డులు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలని క లెక్టర్‌ను కోరారు. అనంతరం పలు పోటీల్లో గెలు పొందిన దివ్యాంగులకు బహుమతులు అందించా రు. ఉపాధి హామీ పథకం కూలీలు, సిబ్బందిని స న్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, ఇన్‌చార్జి డీడబ్ల్యూవో చందర్ నాయక్, డీఆర్‌డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment