జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
బీబీపేట: జాతీయ స్థాయి హాకీ పోటీలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థిని సాంద్ర సిబి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం రవీంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రస్థాయి హాకీ క్రీడా పోటీలలో అండర్–14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి గోల్ కీపర్‌గా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ విద్యార్థిని మధ్యప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి క్రీడా పోటీలలో తెలంగాణ జట్టులో గోల్ కీపర్‌గా ఆడనుంది. ఉపాధ్యాయులు ఈసందర్భంగా అభినందించారు.
వ్యాసరచన పోటీలో లచ్చాపేట విద్యార్థిని ప్రతిభ
మాచారెడ్డి: తరగని శక్తి వనరులు అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో లచ్చాపేట ఉన్నత పాఠశాల విద్యార్థిని అలుగునూరి రిషితకు ప్రశంసాపత్రం లభించినట్లు హెచ్‌ఎం రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ భవాని, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment