ప్రజాసేవలో నిమగ్నం కావాలి
కామారెడ్డి అర్బన్: అధికారులందరూ అహంభావాన్ని వదిలి ప్రజాసేవలో నిమగ్నం కావాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవోస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డెయిరీ కళాశాల ఆడిటోరియంలో టీజీవోస్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు ఐక్యమత్యంతో ఉంటే ప్రభుత్వం నుంచి అన్ని డిమాండ్లు సాధించుకోవచ్చన్నారు. ప్రభుత్వ పనికి మాలిన ఉత్తర్వులతో ఉద్యోగులకు రావాల్సినవి దక్కకుండా పోతున్నాయని, నగదు రహిత హెల్త్ స్కీం పథకం నీరుగారిపోయిందని పేర్కొన్నారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, మెడికల్ బిల్లుల రీయింబర్స్‌మెంట్ తదితర అంశాలపై ఏప్రిల్ తర్వాత కార్యాచరణ ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వానికి సేవకులుగా ఉండి ప్రజలను మెప్పించి అన్ని డిమాండ్లు సాధించాలనేదే తమ లక్ష్యమన్నారు. అన్ని జిల్లాలో టీజీవోస్ భవన నిర్మాణాలు ఏర్పాటు కావాలన్నారు. సమావేశంలో టీజీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, జిల్లా నూతన అధ్యక్షుడు దేవేందర్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆయా జిల్లాల టీజీవోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వారిని ఎలా సక్కగ చేయాలో తెలుసు..
కలెక్టర్లు బ్రిటిష్ వైస్రాయ్‌ల్లాగా నియంతలం అనుకుంటే వారిని ఎలా సక్కగ చేయాలో తమ కు తెలుసని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ని యంతల్లాగా వ్యవహరిస్తూ అధికారులను అవ మానపరుస్తున్నారన్నారు. సామాన్యులు వెళ్లినా గవర్నర్‌లాంటి వారు లేచి నిలబడి మర్యాద ఇ స్తారని, కూర్చోబెట్టి మాట్లాడతారని పేర్కొన్నా రు. ఉద్యోగులను బానిసలుగా చూసే కలెక్టర్ల విషయమై జిల్లాల నాయకత్వాలు కార్యాచరణ ప్రకటిస్తే తాము ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతామని పేర్కొన్నారు.
టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు
Comments
Please login to add a commentAdd a comment