సుభాష్‌నగర్ : నిజామాబాద్ డీసీసీబీలో లక్ష్యం మేరకు వ్యాపారం చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. బ్యాంకు వ్యాపార కార్యకలపాలు రూ.రెండు వేల కోట్ల టోర్నవర్ మార్కు చేరుకున్న సందర్భంగా మంగళవారం నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా లక్ష్యం చేరుకున్నందుకు ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ బ్యాంక్‌లో రూ.794 కోట్లు డిపాజిట్లు, పంట రుణాలు రూ.600 కోట్లు, బంగారు ఆభరణ రుణాలు రూ.317 కోట్లు, ఇతర రుణాలు రూ.313 కోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన రుణమాఫీలో బ్యాంకులో 40,654 మంది రైతులకు రూ.169.73 కోట్ల లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అలాగే మాఫీ పొందిన రైతులకు రూ.160.47 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగిత వారికి కూడా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు రమేశ్‌పాటిల్, ఆనంద్, ప్రొఫెషనల్ డైరెక్టర్ యాదగిరి, సీఈవో నాగభూషణం, జనరల్ మేనేజర్ అనుపమ, డిప్యూటీ జనరల్ మేనేజర్ సుమమాల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment