అభివృద్ధే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ధ్యేయం

Published Wed, Dec 4 2024 1:33 AM | Last Updated on Wed, Dec 4 2024 1:33 AM

అభివృ

అభివృద్ధే ధ్యేయం

– 9లో u

బుధవారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024

– 8లో u

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. జుక్కల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నా. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నా. నామినేటెడ్‌ పదవుల విషయంలో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టా. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో సాగుతున్నారు’’ అని జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది అవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషిని ఆయన వివరించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ వివరాలు..

ఇంటిగ్రేటెడ్‌ గురుకుల పాఠశాల..

జుక్కల్‌ నియోజక వర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ మంజూరు చేయించా. మద్నూర్‌లో రూ.305 కోట్లతో చేపట్టే ఈ భవన నిర్మాణానికి శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో నియోజకవర్గంలోని విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. భవనాలను త్వరితగతిన పూర్తి చేయించి, తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.

సాగునీటి కష్టాలు తీరుస్తా

అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి నిర్మాణం దశాబ్దాల కాలంగా ముందుకు కదలడం లేదు. ఇటీవలే ప్రాజెక్టును సందర్శించాను. మహారాష్ట్ర, తెలంగాణ నీటి పారుదల శాఖల అధికారులతో మాట్లాడాను. ఈ వారంలో ఇరు రాష్ట్రాల సీఈలతో సమావేశం జరగనుంది. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులు సాధించి, పనులు మొదలయ్యేలా ప్రయత్నిస్తున్నాను. ఏడాదిలోపు పనులు పూ ర్తి చేసి నీటిని అందించాలన్న ల క్ష్యంతో సాగుతున్నా. అ లాగే నాగమడుగు ఎత్తిపోతల పథకం పనుల నూ త్వరితగతిన పూర్తి చే యించే ప్రయత్నం చేస్తున్నా.

పోస్టుల భర్తీకి కృషి చేస్తున్నా

జుక్కల్‌ నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరు చేయించా. అప్పట్లో జుక్కల్‌ నియోజకవర్గానికి కేటాయించిన కేంద్రీయ విద్యాలయం వెనక్కి వెళ్లింది. దాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. స్పోర్ట్స్‌ స్కూల్‌ కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఉపాధ్యాయ నియామకాలు, పోస్టింగుల్లో కలెక్టర్‌తో మాట్లాడి ఎక్కువ వచ్చేలా ప్రయత్నించి సఫలమయ్యాను. స్కూల్‌ భవనాలకు నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మద్నూర్‌ డిగ్రీ కాలేజీలో పోస్టుల భర్తీ కోసం ప్రయత్నిస్తున్నాను. అన్ని మండలాల్లో జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాను. అలాగే నియోజకవర్గంలో పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌, బిచ్కుంద ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఉంది. అధికారులతో మాట్లాడి కొందరిని సర్దుబాటు చేయించాను. అవసరమైన డాక్టర్లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. వైద్య సేవలు మెరుగుపడితే పేదలకు మేలు జరుగుతుంది. కచ్చితంగా ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపడేలా చూస్తా.

పర్యాటకాభివృద్ధి వైపు అడుగులు..

నిజాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద పర్యాటకాభివృద్ధి కోసం 12 ఎకరాల భూమి ఇప్పటికే ఇరిగేషన్‌ శాఖ నుంచి పర్యాటక శాఖకు బదిలీ అయ్యింది. ఎకో రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. అలాగే కౌలాస్‌ కోటను కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాను.

నియోజకవర్గానికి వచ్చిన నిధులు..

ఈజీఎస్‌ కింద సీసీ రోడ్లకు రూ. 34.50 కోట్లు, జీపీ భవనాలకు రూ.18 కోట్లు, అంగన్‌వాడీ భవనాలకు రూ.10.80 కోట్లు మంజూరు చేయించా. ఎస్‌డీఎఫ్‌ నిధుల్లో విద్యారంగానికి రూ.2 కోట్లు, బోర్లు, మోటార్ల కోసం రూ.1.70 కోట్లు, సీసీ రోడ్లకు రూ.6.30 కోట్లు వచ్చాయి. పిట్లం కేజీబీవీకి రూ.2.35 కోట్లు, మన ఊరు మన బడి కింద మరమ్మతుల కోసం రూ.3.50 కోట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కింద రూ.1.82 కోట్లు, ఎస్సీ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ. 1.54 కోట్లు, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.10.53 కోట్లు, ఫ్లడ్‌ డ్యామేజెస్‌ కింద రూ.55 లక్షలు, కాల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద రూ.6.41 కోట్లు మంజూరయ్యాయి.

న్యూస్‌రీల్‌

వినూత్నంగా ఏఎంసీ చైర్మన్ల ఎంపిక

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జుక్కల్‌ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్ల ఎంపిక కోసం వినూత్న ప్ర క్రియ చేపట్టా. పార్టీ నాయకుల ముందే మార్కెట్‌ కమిటీలు, వాటి ప్రాధాన్యత, రై తులకు ఎలాంటి మేలు చేస్తారన్న విషయాలపై ఆశావహులను ప్రశ్నలడిగా.. మెరుగైన సమాధానాలు ఇచ్చిన వారినే ఎంపి క చేశా. దీనిని సీఎం రే వంత్‌రెడ్డితో సహా ప్రభు త్వ, పార్టీ పెద్దలందరూ మెచ్చుకున్నారు.

పార్టీలో అసంతృప్తి లేదు..

జుక్కల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి లేనేలేదు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు వ్యక్తులు ఇటీవల రాద్దాంతం చేశారు. పార్టీతో సంబంధం లేని ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే ఇదంతా చేయించారని పార్టీ పెద్దలకు తెలిసిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లను ఎంపిక చేయడాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతమైంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తాం.

త్వరలో బల్దియాగా బిచ్కుంద..

మున్సిపాలిటీ లేని నియోజకవర్గం రాష్ట్రంలో ఒక్క జుక్కల్‌ మాత్రమే ఉంది. అందుకే నియోజకవర్గానికి మున్సిపాలిటీ మంజూరు కోసం ప్రయత్నించా. త్వరలోనే బిచ్కుంద మున్సిపాలిటీ అవుతుంది. బిచ్కుంద బల్దియాగా మారితో చాలా అభివృద్ధి జరుగుతుంది. నియోజక వర్గంలోని మిగతా మండలాల్లోనూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాను.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన

విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి

లెండి, నాగమడుగు పథకాలు త్వరగా పూర్తయ్యేలా చర్యలు

‘సాక్షి’ ఇంటర్వ్యూలో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

No comments yet. Be the first to comment!
Add a comment
అభివృద్ధే ధ్యేయం1
1/3

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం2
2/3

అభివృద్ధే ధ్యేయం

అభివృద్ధే ధ్యేయం3
3/3

అభివృద్ధే ధ్యేయం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement