‘సెస్ వసూలు చేయాలి’
కామారెడ్డి క్రైం: భవన నిర్మాణ కార్మికుల చట్టం ప్రకారం ఏవైనా నిర్మాణాలు జరుగుతున్నప్పు డు వాటి వ్యయంలో ఒక శాతం మొత్తాన్ని సెస్ గా వసూలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో కార్మిక చట్టం సమన్వయ కమిటీ సమా వేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ వసూలు చేసిన సెస్ మొత్తాన్ని కార్మికుల సంక్షేమ బోర్డులో జమ చేయాలన్నా రు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు కార్మిక శాఖ లో రూ. 110 చెల్లించి తన పేరును నమోదు చే సుకోవాలని సూచించారు. సెస్‌గా వసూలు చే సిన మొత్తాన్ని కార్మికుల సంక్షేమానికి వినియో గిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, విక్టర్, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్ పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖలు రూపొందించిన ‘ఒక సంవత్సరం.. ఎన్నో విజ యాలు’ పోస్టర్‌ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, వెటర్నరీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment