నిజామాబాద్ రూరల్: మద్యానికిబానిసైన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌వో ఎండీ ఆరిఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖర్ కాలనీకి చెందిన పాపి విష్ణు(20) గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి అతిగా మద్యం సేవించి తన తల్లితో గొడవ పడి ఇంటిపైనున్న చీరను మెడకు చుట్టుకొని కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment