ఆగని ఇసుక అక్రమ రవాణా
రుద్రూర్: పొతంగల్ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణ అడ్డూఅదుపు లేకుండా సాగుతోంది. అధికారులను ఇసుక మాఫియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. గత కొన్ని నెలలుగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోందని ఫిర్యాదులు అందడంతో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంజీర పరీవాహక ప్రాంతంలో ఇటీవల పర్యటించారు. ఆయన ఆదేశాల మేరకు పది రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణా కట్టడికి రెవెన్యూ, పోలీసులతో కలిసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం ప్రతి రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు పెట్రోలింగ్ చేస్తోంది. బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత మండలంలోని తిర్మలాపూర్ క్రాసింగ్ వద్ద ప్రత్యేక బృందం ఇసుక టిప్పర్‌ను గుర్తించి అడ్డుకుని కోట గిరి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో పొ తంగల్ గ్రామానికి చెందిన దత్తు అనే వ్యక్తి స్పెషల్ టీమ్ సభ్యులపై దౌర్జన్యం చేసి టిప్పర్‌ను అక్కడి నుండి తీసుకెళ్లాడని తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. దీంతో ఇసుక లోడ్ చేసిన పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నా రు. అధికారులను బెదిరించిన దత్తుపై పోలీస్‌స్టేష న్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
అడ్డుకట్ట పడేనా?
పొతంగల్ మండలంలోని మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. రెవెన్యూ, పోలీస్ సిబ్బందిపై ఇసుకాసురులు దౌర్జన్యం చేస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గతంలో కొడిచర్ల శివారులో తాత్కాలిక చెక్ పోస్టుకు నిప్పు పెట్టారు. ఇసుక డంప్‌ల సంగతి చెప్పనవసరం లేదు. ఇసుక డంప్ చేసి దర్జాగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే ఇసుక అక్రమ దందాను అరికట్టవచ్చని స్థానికులు అంటున్నారు.
అడ్డుకున్న స్పెషల్ టీమ్‌పై దౌర్జన్యం
జేసీబీ సీజ్.. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment