వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి
మద్యం మత్తులో కిందపడి మృతి
ఖలీల్‌వాడి: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కిందపడి మృతి చెందిన సంఘటన నగరంలోని మూడోటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుర్బాబాది రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లికి చెందిన కృష్ణ(35) బోరురిపేర్ చేసి వస్తానని చెప్పి ఈనెల 24వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. మద్యం తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్న కృష్ణ గురువారం ఉదయం 9గంటలకు లలిత మహల్ థియేటర్ పక్కన పడి మృతి చెందాడు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో మునిగి పశువుల కాపరి..
రెంజల్(బోధన్): చెరువులో మునిగి పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. రెంజల్ గ్రామానికి చెందిన తూర్పు రాజు (40) అనే వ్యక్తి గ్రామంలోని లియాక్ వద్ద పశువుల కాపరిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. రోజూలాగే గురువారం పశువులను మేతకు తీసుకెళ్లా డు. స్థానిక పెద్ద చె రువులో పశువులను కడిగేందుకు దిగిన రాజు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ..
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఉ న్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ గురువారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళ మృతి చెందిందని ఆమె బంధువులు ఆరోపించారు. వివరా లు ఇలా ఉన్నాయి.. ఎల్లారెడ్డి మండలం గండి మాసానిపేట గ్రా మానికి చెందిన మాలకాని శాంతమ్మ (52) ఎడకా లు నడుము వద్ద ప్రమాదవశాత్తు విరగగా, జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ కోసం ఐదురోజుల క్రితం అడ్మిట్ చేశారు. ఆమెకు షుగర్ ఉండటంతో వైద్యు లు చికిత్స అందిస్తూ, ఆరోగ్యశ్రీ అనుమతి రాగానే గురువారం ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి మృతి చెందిందని శాంతమ్మ కుమారుడు ప్రభాకర్ ఆరోపించారు. షుగర్ ఉండటం, ఆపరేషన్ సమయంలో గుండె నొప్పి రావడంతో మృతి చెందిందని, తమ నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారి 44పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బీహార్‌కు చెందిన రుషికేశ్(67) నిజామాబాద్ ప్రభుత్వ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందా డు. ముప్కాల్ ఎస్సై రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..వరి నా ట్లు వేసే పనుల కోసం వచ్చిన రుషికేశ్ జాతీయ రహ దారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొ ట్టింది. తీవ్రగాయాలపాలైన రుషికేశ్‌ను వెంటనే హైవే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
శతాధిక వృద్ధురాలు మృతి
ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన శతాధిక వృద్ధురాలు షౌకత్ బీ గురువారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 103 ఏళ్ల షౌకత్ బీ అనారోగ్య కారణాలతో మృతి చెందిందన్నారు. మృతురాలికి కుమార్తెలు, కుమారుడు ఉన్నట్లు వారు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment