బాక్సులు ఓకే .. మందులేవి..?
బాన్సువాడ: ప్రయాణికుల భద్రతే లక్ష్యం, వారి సంఖ్య పెంచడమే ధ్యేయం అని చెప్పే ఆర్టీసీ అధికారులు కనీస వైద్య సదుపాయాలు కల్పించడం లే దు. విధిగా బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలి. అయితే బస్సుల్లో బాక్సులు ఏర్పా టు చేశారే తప్ప మందులు అందుబాటులో ఉంచ డం లేదు. బాక్సుల్లో మందులు లేకపోవడంతో ప్రమాద సమయాల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రవాణా శాఖ అధికారులు బస్సులను రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాత్రమే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉంటే చాలనుకుంటున్నారు. కానీ అందులో మందులు ఉంటున్నాయో లేదో పట్టించుకోవడం లేదు. ప్రతీ రోజు ఒక్క బాన్సు వాడ డిపో పరిధిలో 40 రూట్‌లలో సుమారు 46 వేల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అలాగే జిల్లాలో ఉన్న బాన్సువాడ, కామారెడ్డి ఆర్టీసీ డిపోలకు చెందిన ఏ బస్సులో కూడా మందులు కనిపించడం లేదు. రెండు డిపోలలో 192 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో పేరుకే ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఉన్నా వాటిలో మందులు మాత్రం పెట్టడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment