ప్రభుత్వ సలహాదారుకు జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి టీపీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్‌యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం ఆయనను వేణు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కొనసాగుతున్న
నీటి విడుదల
బాల్కొండ: యాసంగి సీజన్ కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 5,500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 360, గుత్ప లిఫ్ట్ ద్వారా 270, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 445 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడగులు కాగా గురువారం సాయంత్రానికి 1090.80 (79.65 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.
నేడు పాసింగ్ అవుట్ పరేడ్
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న టీజీఎస్పీ కానిస్టేబుళ్లకు శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్లు కమాండెంట్ పి సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్పీ ట్రెయినీ కానిస్టేబుళ్లుగా ఎంపికై న 463 మందికి గత 9 నెలలుగా డిచ్‌పల్లి ఏడో బెటాలియన్‌లో వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. శిక్షణ పూర్తయిన నేపథ్యంలో పాసింగ్ పరేడ్ నిర్వహించి ఆయా బెటాలియన్‌లలో విధుల కేటాయింపునకు సంబంధించి నియామక ఉత్తర్వులను ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెదక్ ఐజీ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా నిజామాబాద్ ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ పాల్గొంటారని పేర్కొన్నారు.
జాతీయస్థాయి
బేస్‌బాల్ టోర్నీకి ఎంపిక
డిచ్‌పల్లి: పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సీనియర్ బేస్‌బాల్ మహిళల టోర్నమెంట్‌కు మండలంలోని సుద్దపల్లిలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల క్రీడాకారిణులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ నళిని గురువారం తెలిపారు. తమ కళాశాల క్రీడాకారిణులు సుమలత, నిషా జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర జట్టుతోపాటు సుమలత, నిషా పంజాబ్‌కు బయల్దేరి వెళ్లారని జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మధుసూ దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment