నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కామారెడ్డి క్రైం: నాణ్యతా ప్రమాణాలు సరి చూసుకుని ధాన్యం ఎగుమతులు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఎగుమతి కార్యాచరణ ప్రణాళికలపై అవగాహన సదస్సును బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఎగుమతులపై సందేహాలు, సలహాలు, సూచనలు అందించడానికి జిల్లాలోని వ్యాపారవేత్తలకు ఇలాంటి సమావేశాలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జిల్లాలో అత్యధికంగా సాగవుతున్న వరి ధాన్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ధాన్యంతో పాటు జిల్లా నుంచి జరిగే ఇతర ఎగుమతుల్లో ఎదురవుతున్న అడ్డంకులపై వ్యాపారులతో చర్చించారు. ఈ సదస్సులో ఎంఎస్‌ఎంఈ, బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్), అపెడ, టీఎస్‌ఐఐసి, పలు సంస్థల ప్రతినిధులు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ లాలు నాయక్, డీఏవో తిరుమల ప్రసాద్, మత్స్య శాఖాధికారి శ్రీపతి, డీఆర్‌డీవో సురేందర్, మార్కెటింగ్ అధికారి రమ్య పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రతా ఏర్పాట్లు, రికార్డులు, సీసీటీవీ ద్వారా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరు తదితర అంశాలను పరిశీలించారు. ఈవీఎం గోదాం వద్ద పోలీసు బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. ఓటింగ్ యంత్రాల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో రంగనాథ్ రావు, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు సరళ, డీటీలు అనిల్, ఇందిర తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment