అధ్వానంగా అంతర్ జిల్లా రోడ్డు
పిట్లం(జుక్కల్): రెండు జిల్లాలను కలిపే ఆ రోడ్డు అధ్వానంగా ఉంది. పిట్లం, సంగారెడ్డి జిల్లా కల్హెర్ మండల కేంద్రాలను కలిపే రోడ్డు అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోవడం లేదు. ఈ మార్గంలో జిల్లా సరిహద్దులో నల్లవాగుపై గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వంతెన నిర్మించారు. వంతెనకు అటువైపు సంగారెడ్డి జిల్లాలో బీటీ రోడ్డు వేశారు. కామారెడ్డి జిల్లాలో మాత్రం బీటీ వేయకపోబడంతో మట్టిరోడ్డు వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. పంట పొలాల నుంచి నీరు ఈ రోడ్డు మీదకు రావడంతో బురదమయంగా మారుతోంది.
వంతెన నిర్మించినా ..
పిట్లం, కల్హెర్ మండలాల మధ్య దూరం మూడున్నర కిలోమీటర్లు. మధ్యలో నల్లవాగు ఉంటుంది. వంతెన లేకముందు వర్షాకాలం వచ్చిదంటే ప్రజలు పిట్లం, కల్హెర్ రాకపోకలు సాగించేవారు 15 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేసేవారు. పిట్లం వ్యాపార కేంద్రం కావడంతో కల్హెర్ మండల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో భాగంగా కల్హెర్ మండల ప్రజలు నల్లవాగుపై వంతెన నిర్మాణానికి నిధులు కావాలని కోరారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే నిధులు మంజూరు చేశారు. అనంతరం వంతెన నిర్మాణం పూర్తయింది. వంతెన నుంచి కల్హెర్ వరకు బీటీ రోడ్డు వేశారు. కానీ పిట్లం నుంచి వంతెన వరకు మాత్రం మట్టి రోడ్డే ఉంది. రెండు కిలోమీటర్ల మేర రోడ్డు వేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పిట్లం – కల్హెర్ రహదారిని
అభివృద్ధి చేయని పాలకులు
ఏళ్లు గడుస్తున్నా బీటీకి నోచుకోని వైనం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment