చైన్ స్నాచర్ల అరెస్టు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఒక మైనర్‌తో పాటు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పోలీస్‌స్టేషన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. పట్టణంలోని జెమ్మన్‌జట్టి గల్లీకి చెందిన బట్టు బాల్‌రాజ్ ఓ మైనర్ అబ్బాయితో కలిసి నంబర్‌లేని స్కూటీపై తిరుగుతూ పలు చోట్ల చైన్‌స్నాచింగ్ పాల్పడినట్లు తెలిపారు. మామిడిపల్లిలోని రకుంబాయి మెడలో నుంచి, పెర్కిట్ విశాఖ కాలనీలో, రాజారాం నగర్‌లో మహిళల మెడలో నుంచి బంగారు గోలుసులను చోరీ చేశారన్నారు. సదరు నగలను పట్టణంలోని హరిచంద్రప్రసాద్‌కు విక్రయించారన్నారు. ఆదివారం ఉదయం పట్టణంలో నిందితులను అదుపులో తీసుకొని విచారించామన్నారు. బాల్‌రాజ్‌తోపాటు నగలను కొనుగోలు చేసిన హరిచంద్రప్రసాద్‌ను రిమాండ్‌కు తరలించారు. బాలున్ని జూవైనల్ హోమ్‌కు తరలించారు. కాగ నిందితుల వద్ద నుంచి 75గ్రాముల బంగారాన్ని, స్కూటీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ ఐడీ పార్టీ సిబ్బందికి, కానిస్టేబుళ్లకు రివార్డులు అందించి అభినందించారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, ఎస్సైలు గోవింద్, మహేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment