నాసిరకం ఫిల్టర్ల వాడకం
బిచ్కుంద(జుక్కల్): విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రూ.లక్షల నిధులు మంజూరు చేసింది. ట్యాంకులు బిగించి స్వచ్ఛమైన నీటి కోసం వాటర్ ఫిల్టర్లు అమర్చాలని ఆదేశించింది. జిల్లాలో ఒకటి రెండు చోట్ల తప్ప అన్ని మండలాల్లో అమర్చిన వాటర్ ఫిల్టర్లు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయి. బిచ్కుంద మండలంలో పనులు జరిగేటప్పుడు అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం ఫిల్టర్లు అమర్చి చేతులు దులుపుకున్నారు. నాసిరకం వాటర్ ఫిల్టర్లు బిగించడంతో నీరు శుభ్రం కావడం లేదు.. దీంతో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. వాస్తవానికి నీటిని శుద్ధి చేయడానికి ఫిల్టర్ చేసే క్యాండిల్ రంధ్రాలు కంటికి కనబడనంత చిన్నగా ఉంటాయి. ఈ రకమైన ఫిల్టర్‌తో నీటిలోని బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి తొలగి మంచి నీరు వస్తాయి. కాని బిచ్కుంద బోయివాడ పాఠశాలలో బిగించిన వాటర్ ఫిల్టర్లు నాసిరకంగా ఉన్నాయి. అందులో ఫిల్టర్ క్యాండిల్ లేదు.. ప్లాస్టిక్ జాలీ మాత్రమే ఉంది. ఆ జాలీ ద్వారా నీరు శుద్ధి కావడం లేదు. ఈ కారణంగా విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందని ద్రాక్షలా మారింది.
పేరుకే అమ్మ ఆదర్శ కమిటీలు..
పాఠశాలల పర్యవేక్షణ, అభివృద్ధి కోసం ఉన్న ఎస్‌ఎంసీ కమిటీలను ప్రభుత్వం రద్దు చేసి కొ త్తగా అమ్మ ఆదర్శ కమిటీలు వేసింది. పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు, వాటర్ ఫి ల్టర్లు, మరుగుదొడ్లు, విద్యుత్ ఇతర పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే జరిగాయి. కమిటీలు, సంబంధిత అధికారుల పనుల పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకం పనులు చేసి చేతులు దు లుపుకున్నారు. బిగించిన ఫిల్టర్‌తో నీరు శుద్ధి కాకపోవడంతో నీటి నుంచి దుర్వాసన వస్తుంది. విద్యార్థులు పాఠశాలలోని నీరు తాగడం లేదు.. ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నాణ్యమైన ఫిల్టర్లు బిగించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు.
నీటిని శుద్ధి చేయని ఫిల్టర్లు
స్వచ్ఛమైన తాగు నీటి కోసం
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
పట్టించుకోని ఉపాధ్యాయులు,
అధికారులు
Comments
Please login to add a commentAdd a comment