బోధన్ రూరల్(బోధన్): మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈనెల 9న ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మచ్చేందర్‌రెడ్డి ఆదివా రం తెలిపారు. వివరాలు ఇలా.. బండారుపల్లి గ్రా మానికి చెందిన మల్లప్పగారి మాధవరావు(55) జా డిజ మాల్‌పూర్ గ్రామానికి చెందిన రెంజర్ల(చాకలి) ల క్ష్మికి సన్నిహిత సంబంధం ఉంది. లక్ష్మి సుమారు 20రోజుల క్రితం తాను పని చేసే యజమాని ఇంట్లో రూ. 45వేలు దొంగలించి సొంతానికి వాడుకుంది. ఆ డబ్బులను చెల్లించాలని లక్ష్మి, ఆమె కొడుకు భూమయ్య, కోడలు రుక్మిణి మాధవరావును తర చు వేధించేవారు. తమకు డబ్బు ఇవ్వకపోతే దొంగిలించిన డబ్బు తనకే ఇచ్చినట్టు పోలీసులకు చెబుతానని మాధవరావును బెదిరించింది. ఈ క్రమంలో మాధవరావు భయపడి బిక్నెల్లి శివారులోని మంజీర నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై పేర్కొన్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ సమీపంలో రేషన్ బియ్యం తరలిస్తున్న మినీ వ్యాన్‌ను పట్టుకున్నట్లు ఎస్సై రామ్ ఆదివారం తెలిపారు. గ్రామ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి తన వాహనంలో ఎలాంటి అనుమతి లేకుండా రేషన్ బియ్యం తరలిస్తున్నాడని తెలిపారు. పోలీసులను చూసి ఆ వ్యక్తి తన వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడని తెలిపారు. వాహనంలో తనిఖీ చేయగా 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
హుండీ చోరీ
బోధన్ రూరల్ (బోధన్): మండలంలోని రాజీవ్ నగర్‌తండా గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో ఉన్న హుండీని గుర్తుతెలియని దుండగులు పగులగొట్టిన చోరీ చేసినట్లు రూరల్ ఎస్సై మచ్చేందర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. హుండీలో ఉన్న సుమారు రూ. 5వేల నగదును దుండులు దోచుకెళ్లారన్నారు. ఆలయ క్యాషియర్ నేనావత్ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment