పండిత్ పరిషత్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నిక
నిజామాబాద్ రూరల్: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీహెచ్‌ఎస్ సారంగపూర్ తెలుగు ఉపాధ్యాయుడు, ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ హిందీ ప్రచార సభ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్రసర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఎండీ అబ్దుల్లా, కాంతి కృష్ణ, భిక్షపతి, ఎండి జమీల్, కేవీ రమణాచారి తదితరులు ఉన్నారు.
యువ రైతులు
సంఘటితం కావాలి
నిజామాబాద్ నాగారం: యువ రైతులు సంఘటితం అయి కొత్త రకపు వ్యవసాయం చేయా లని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ రూట్స్ కాలేజీలో ఆదివారం స్వా మి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువ దినోత్సవం సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో యువ రైతు పురస్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై, వివిధ జిల్లాల నుంచి వచ్చిన యువ రైతులకు పురస్కారాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యు వత వ్యవసాయంపై ఆసక్తి పెంచుకోవాలన్నా రు. రూట్స్ కాలేజీ అధినేత భిక్షపతి, రవీందర్ ర్యాడ, ఆర్మూర్ శ్రవణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ నాగారం: నగరంలోని జీజీహెచ్‌లో రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రగతి శీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి కోరారు. ఈ మేరకు ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. మరోవైపు ఆస్పత్రిలో సూపరింటెండెంట్ జన్మదిన వేడుకలు జరుపుకున్న ఘటనపై కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న లక్ష్మి అనే రోగికి ఫిట్స్ వస్తోందని ఆస్పత్రికి తీసుకొస్తే పట్టించుకోలేదన్నారు.
టాస్క్‌ఫోర్స్ దాడులు
బోధన్: పట్టణంలోని పలు చోట్ల ఆదివారం టాస్క్‌ఫోర్స్ టీం ఏసీపీ నాగేంద్రచారి నేతృత్వంలో సీఐ అంజయ్య, సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈమేరకు ఇన్‌చార్జి సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆఫీసర్స్ క్లబ్‌పై దాడి చేసి పేకాడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 31వేల నగదు, 24 సెల్‌ఫోన్‌లు, పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బోధన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అలాగే ఏఆర్ కిరాణా షాప్‌పై దాడి చేసి రూ. 8వేలు విలువ చేసే 8 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. షాప్ యాజమాని జునైద్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment