స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం శెట్పల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండల సమన్వయకర్త అట్టెం శ్రీనివాస్, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడ్వాయి పరిధిలో..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): బ్రాహ్మణపల్లి, కాళోజీవాడి, దేవాయిపల్లి గ్రామాలలో ఆదివారం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించారు. అలాగే బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మండల కో–ఆర్డినేటర్ పైడి రాజేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు గైని శివాజీ, మండల ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేటలో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పథకాలపై నాగిరెడ్డిపేటలో ఆదివారం గ్రామ కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు సాయాగౌడ్, మండల కో–ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పథకాల గురించి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment