సంక్రాంతి ముగ్గుల సంబురం
కామారెడ్డి అర్బన్: వీహెచ్‌పీ, మాతృశక్తి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, కార్యదర్శి బి.రాజు, నగర అధ్యక్షుడు వి.వెంకటస్వామి, మాతృశక్తి సంయోజక రాజ్యశ్రీ, సహ సంయోజక ఇందిర తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో..
రామారెడ్డి: గిద్ద గ్రామంలో కరీంనగర్ డెయిరీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు డెయిరీ ప్రతినిధులు బహుమతులను అందజేశారు. డెయిరీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీవదాన్ పాఠశాలలో..
ఎల్లారెడ్డి: పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో ముగ్గుల పోటీలు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుర్మ సాయిబాబా నిర్వహించారు. ఈ పోటీలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, డీఎస్పీ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతిగా 5 తులాల వెండి, ద్వితీయ బహుమతిగా 3 తులాల వెండిని బహూకరించారు.
బాన్సువాడలో..
బాన్సువాడ: బాన్సువాడ ఎన్‌జీవోస్ కాలనీలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నారులకు పతంగుల పోటీలు పెట్టారు. చూడముచ్చటగా ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ విజయలక్ష్మి, సుజాత, మనస్వీని, శ్రుతిక, చంద్రశ, సమన్విత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment