మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి
రెంజల్: మద్యం మత్తులో భార్య, అత్తపై బ్లేడుతో దాడి చేశాడో వ్యక్తి. ఈ ఘటన రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఫర్జానాకు మహారాష్ట్రలోని భోకర్‌లో గల ఫారూఖ్ పటాన్‌తో వివాహం జరిగింది. మద్యానికి బానిసైన అతను భార్యను వేధించడంతో పెద్దలు సర్ది చెప్పి ఇద్దరిని కందకుర్తికి తీసుకవచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేస్తు నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. ఆదివారం రాత్రి తాగిన మత్తులో భార్యతో పాటు అత్త కమర్‌బేగంలపై దాడి చేశాడు. బ్లేడ్‌తో వారి గొంతుకోయడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఫర్జానా ఫిర్యాదు మేరకు ఫారూఖ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment