భిక్కనూరు : పంట రుణాలు మాఫీ కాని రైతులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. సోమవారం జాతీయ రహదారిపై ధర్నా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్న పోలీసులు.. తెల్లవారుజామునే పలువురు రైతులను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలో పంట రుణాలు మాఫీ కాని రైతులంతా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనకు నాయకత్వం వహించే అవకాశాలున్నట్లు అనుమానించి భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన ఆరుగురిని, లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 10 గంటల వరకు స్టేషన్‌లోనే ఉంచుకున్నారు. అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనలు చేస్తే కేసులు నమోదవుతాయని హెచ్చరించి వదిలిపెట్టారు.
11 మంది రైతులను అదుపులోకి
తీసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment