ఉద్యాన క్షేత్రంలో చెలరేగిన మంటలు
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెదలోని ఉద్యాన క్షేత్రంలో సోమవారం రాత్రి ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఉద్యాన క్షేత్రంలోని పండ్ల తోటలను మంటలు చుట్టుముట్టాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఎల్లారెడ్డి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఎల్లారెడ్డి అగ్నిమాపక కేంద్రం అధికారి కిష్టయ్య ఫైర్ ఇంజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలతో ఉద్యాన క్షేత్రంలోని ఉసిరి, జామ, మామడి, ఆయిల్‌పాం తోటలు కాలిపోయాయి. సాయంత్రం నుంచే ఉద్యాన క్షేత్రంలో మంటలు వ్యాపించడం ప్రారంభమైందని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఉద్యాన క్షేత్రంలో అధికారులెవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఉద్యానక్షేత్రంలో చెలరేగిన మంటల వల్ల జరిగిన నష్టంపై మంగళవారం స్పష్టత రానుంది.
ఉద్యాన క్షేత్రాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది
దగ్ధమైన పండ్ల తోటలు
మంటలను ఆర్పిన
అగ్నిమాపక సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment