నాలుగు పథకాల్లో రైతు భరోసా మినహా మిగతా వాటిపై అయోమయం నెలకొంది. మిగతా మూడు పథకాల అమలులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా రైతు కూలీల కోసం ఉద్దేశించిన రైతు ఆత్మీయ భరోసా పథకం నిబంధనలతో చాలామంది నిరుత్సాహానికి గురయ్యారు. జిల్లాలో లక్షా 47 వేల మంది రైతు కూలీలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఉపాధి హామీ పథకంలో గతేడాది 20 రోజులకుపైగా పనిచేసిన కుటుంబాలను ప్రామాణికంగా తీసుకోవడంతో చాలామంది అర్హత కోల్పోయారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా తీసుకున్న లెక్కల ప్రకారం 15,501 కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం కలగనుంది. కొందరు రైతు కూలీలు వ్యవసాయ పనులకు మాత్రమే వెళతారు. వారు ఉపాధి పనులకు వెళ్లరు. చాలామంది పట్టణాలలో కూలీలుగా పనిచేస్తున్నారు. అలాగే మున్సిపాలిటీల్లో ఉపాధి హామీ పథకం లేకపోవడంతో చాలామందికి ఈ పథకం వర్తించదు. దీంతో వారంతా నిరాశ చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 2.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 12,250 ఇళ్లు మాత్రమే మంజూరవుతాయి. దీంతో మిగిలినవారు రెండో విడత కోసం ఎదురుచూడాల్సిందే.. అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తారా, లేక నేతలు సూచించిన వారి పేర్లే ఫైనల్ అవుతాయా అన్నదానిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment