‘మాస్టర్‌ ప్లాన్‌ రద్దయ్యే వరకు పోరాటం’ | - | Sakshi
Sakshi News home page

‘మాస్టర్‌ ప్లాన్‌ రద్దయ్యే వరకు పోరాటం’

Published Tue, Jan 21 2025 2:07 AM | Last Updated on Tue, Jan 21 2025 2:07 AM

‘మాస్టర్‌ ప్లాన్‌ రద్దయ్యే వరకు పోరాటం’

‘మాస్టర్‌ ప్లాన్‌ రద్దయ్యే వరకు పోరాటం’

కామారెడ్డి టౌన్‌: ప్రభుత్వం కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రద్దు జీవోను విడుదల చేసేంతవరకు ఐక్యంగా పోరాటం చేస్తామని మాస్టర్‌ ప్లాన్‌ బాధిత రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్‌లో మాస్టర్‌ ప్లాన్‌ బాధిత గ్రామాల రైతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ జీవో విడుదల చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం అదే మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వస్తే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేస్తామని అప్పట్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఉద్యమం చేసి మాస్టర్‌ ప్లాన్‌ నిలిపివేయించామని, తిరిగి అదే స్ఫూర్తితో రద్దు జీవో కోసం మరోమారు ఉద్యమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో టేక్రియాల్‌, అడ్లూర్‌ఎల్లారెడ్డి, పాతరాజంపేట, దేవునిపల్లి, రామేశ్వరపల్లి, అడ్లూర్‌, సరంపల్లి, లింగాపూర్‌ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement