23న ‘గార్డ్’ టీజర్ విడుదల
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లి శివారులోగల ఎస్‌ఆర్‌ఎస్ గార్డెన్‌లో ఈ నెల 23న సాయంత్రం 7 గంటలకు ‘గార్డ్’ సినిమా టీజర్ విడుదల చేస్తున్నట్లు సినీ హీరో శీలం విరాజ్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఎస్‌ఆర్‌ఎస్ గార్డెన్‌లో ఆయన మాట్లాడారు. మోపాల్ మండలం కంజర్ గ్రామంలో పుట్టి పెరిగానని, మొదటిసారిగా గార్డ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. టీజర్ విడుదల సందర్భంగా జబర్ధస్త్ కామెడీ షో ఆర్టిస్టులు వస్తున్నారని, నృత్య ప్రదర్శనలు ఉంటాయన్నారు. లాస్యరెడ్డి యాంకర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. టీజర్‌తోపాటు పాటలు కూడా విడుదల చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment