సమస్యలు త్వరగా పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ద్వారా దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 118 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిర్యాదులను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రంగనాథ్ రావు, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెరువు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
బాన్సువాడ పట్టణంలోని ఎల్లయ్య చెరువు ఆక్రమణకు గురవుతోందని పట్టణానికి చెందిన శివప్రసాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎల్లారెడ్డి, దోమకొండ, తాడ్వాయిలలో
ఫిర్యాదులు నిల్
ఎల్లారెడ్డి/దోమకొండ/తాడ్వాయి: తహసీల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేవని ఎల్లారెడ్డి, దోమకొండ, తాడ్వాయి తహసీల్దార్లు మహేందర్‌కుమార్, సంజయ్ రావు, రహీమొద్దీన్‌లు సోమవారం వేర్వేరుగా తెలిపారు. గ్రామాలలో ఇంకా ఏమైనా సమస్యలున్నట్లయితే వచ్చే సోమవారం జరిగే ప్రజావాణిలో ఫిర్యాదులు చేసుకోవచ్చని సూచించారు.
పిట్లంలో ఒక ఫిర్యాదు
పిట్లం(జుక్కల్): స్థానిక తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ వేణుగోపాల్ పేర్కొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ప్రజావాణిలో ఒక ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఎంపీడీవో కమలాకర్, మండల విద్యాధికారి దేవిసింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణికి 118 వినతులు
Comments
Please login to add a commentAdd a comment