గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
పెద్దకొడప్‌గల్(జుక్కల్): గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. సోమవారం వడ్లంలో సీసీ రోడ్లు, కాస్లాబాద్‌లో సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాస్లాబాద్ గ్రామంలో 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో రూ.21 లక్షల సహకార సంఘం నిధులతో గోదాం నిర్మాణం, రూ.5 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభం, వడ్లంలో రూ.5 లక్షలతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రాంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు ఇందిరాబాయి, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, శామప్ప పటేల్, హైమద్, మల్లప్ప పటేల్ తదితరులు పాల్గొన్నారు.
బిచ్కుంద పరిధిలో..
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని పెద్దదేవాడ, వాజిద్‌నగర్, గుండెనెమ్లి, బండరెంజల్ గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యలు గుర్తించి దశల వారీగా పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలో కొత్తగా మూడు 108 అంబులెన్స్ ప్రారంభించామని తెలిపారు. గత పదేళ్లలో అన్ని రంగాల్లో నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని, జుక్కల్ అభివృద్ధికి రూ.వందల కోట్ల నిధులు అభివృద్ధి కోసం మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జుక్కల్ క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నానన్నారు. నాయకులు విఠల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, గంగాధర్, గోపాల్‌రెడ్డి, రాజు పటేల్, నాగ్‌నాథ్, తుకారాం పాల్గొన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Comments
Please login to add a commentAdd a comment