సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ బాధితులకు అందజేశారు. మల్లూర్, ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాలకు చెందిన బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు.
జేసీబీ, టిప్పర్ సీజ్
చేసిన అధికారులు
నాగిరెడ్డిపేట: అనుమతులు లేకుండా మొరం తవ్వకాలకు వినియోగించిన జేసీబీ, టిప్పర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ గేట్ వద్ద అసైన్‌మెంట్ భూమిలో అనుమతులు లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు జేసీబీతో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టినట్లు తహసీల్దార్ శ్రీనివాస్‌రావు తెలిపారు. విషయం తన దృష్టికి రావడంతో జేసీబీతోపాటు టిప్పర్‌ను ఆదివారం రాత్రి పట్టుకొని సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు.
చిరుత కలకలం
మాచారెడ్డి:మాచారెడ్డి మండల సరిహద్దులో సోమవారం చిరుత కనిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.సిరిసిల్ల జిల్లా గంభీ రావుపేట మండలంలో చిరుత దూడపై దాడి చేసింది.దీంతో గంభీరావుపేట,మాచారెడ్డి మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సెల్‌ఫోన్ అప్పగింత
ఎల్లారెడ్డిరూరల్: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి రికవరీ చేసి సోమవారం అందించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డికి చెందిన కాపర్తి బాలకిషన్ కొద్ది రోజుల క్రితం సెల్‌ఫోన్ పోగొట్టుకోవడంతో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. బాధితుడు అందించిన వివరాల ఆధారంగా ఫోన్ ఆచూకీ గుర్తించి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని బాలకిషన్‌కు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
రిటైర్డ్ ఉపాధ్యాయుడి మృతి
భిక్కనూరు: మండలంలోని అంతంపల్లికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోల్కొండ నర్సింహారెడ్డి(63) సోమవారం రాత్రి మృతిచెందారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రిటైర్ అయ్యేదాకా పనిచేశారు. అంత్యక్రియలు మంగళవారం ఆయన సొంతూరు అంతంపల్లిలో జరుగనున్నాయి.
ఐకేపీ క్యాలెండ ర్ల ఆవిష్కరణ
నిజాంసాగర్(జుక్కల్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(ఐకేపీ) ఆధ్వర్యంలో మండల కేంద్రంలో క్యాలెండర్లు, డైరీలను స్థానిక ఎంపీడీవో గంగాధర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు వనిత, ఏపీఎం రాంనారాయణగౌడ్, వీవోఏల సంఘం మండల అధ్యక్షుడు భూమయ్య, కార్యదర్శి కృష్ణవేణి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment